కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య (Annamayya) జిల్లాలో అడవి ఏనుగుల బీభత్సం రైతులను ఆందోళనకు గురిచేసింది. కేవీ.పల్లి మండలంలో ఎనిమిది ఏనుగుల గుంపు (Elephant Herd) వ్యవసాయ పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేశాయి. ఏనుగులు వరి పొలాలు, టెంకాయ తోటలను తొక్కివేయడంతో పాటు బోరు పైపులను కూడా ధ్వంసం చేసినట్లు బాధిత రైతులు తెలిపారు. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల సంచారాన్ని నియంత్రించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం
Follow Us On : WhatsApp

