Mobile Popup Ad
Mobile Popup Ad

దిండు దగ్గర మొబైల్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ జీవితంలో అంతర్భాగం అయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఫోన్ ద్వారా అనేక కార్యకలాపాలు చేస్తుంటాం. ఇక రాత్రి పడుకునే ముందు కూడా కొంత మంది ఫోన్ వదలరు. దిండు దగ్గరే పెట్టుకుని నిద్రపోతుంటారు (Phone Near Pillow). కానీ ఇలా చేయడం ప్రమాదం అని మీకు తెలుసా? అవును నిద్రపోయేటప్పుడు ఫోన్ ను దిండు దగ్గర పెట్టుకుని పడుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు టెక్ నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మందికి నిద్రపోయే ముందు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలా కాసేపు ఫోన్ చూసిన తర్వాత, దానిని దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే, ఫోన్ నుంచి నిరంతరంగా వచ్చే నోటిఫికేషన్లు, వైబ్రేషన్లు, స్క్రీన్ లైట్ కారణంగా నిద్రకు తీవ్రమైన భంగం కలుగుతుంది.

రాత్రంతా ఫోన్లను తలకు సమీపంలో పెడ్డుకోవడం వలన మెదడుపై రేడియేషన్ ప్రభావం పడుతుంది. ఫోన్ల నుంచి వెలువడే విద్యుతయస్కాంత వికిరణం మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల వచ్చే ‘బ్లూ లైట్ మన కళ్ళకు తీవ్రమైన అలసట కలిగిస్తుంది. ఇది శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి, సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు.

ఫోన్ చూస్తూ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు తీవ్రమైన చిరాకు, అలసట, నిరాశ, ఆందోళన (Anxiety) వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల రాత్రి పూట ఫోన్‌ను దిండు పక్కన లేదా బెడ్‌పై ఛార్జింగ్‌లో ఉంచి పడుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>