Mobile Popup Ad
Mobile Popup Ad

ములుగులో 25 తులాల బంగారం చోరీ..!

కలం, ములుగు: ములుగు (Mulugu) జిల్లాలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు (Gold Theft). బాధిత కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి, క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>