కలం, వెబ్ డెస్క్: తన సినిమా విడుదలకు చాలా గ్యాప్ వచ్చిందని, అభిమానులకు అసలు ముఖం చూపించుకోలేకపోతున్నానని అక్కినేని అఖిల్ (Akkineni Akhil) అన్నారు. అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ (Lenin) ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్‌లో అఖిల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. రెండేళ్ల నుంచి ఫ్యాన్స్‌కు ముఖం చూపించుకోలేకపోతున్నానని అన్నారు. తన మనసులో ఎంతో బాధ ఉందన్నారు.
తాను వైజాగ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కూడా ఫ్యాన్స్‌కు సారీ చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఒక పాజిటీవ్ మైండ్ సెట్‌తో ఉన్నట్లు చెప్పారు. ఆ పాజిటివ్ మైండ్ సెట్ లెనిన్ అని చెప్పారు. లెనిన్‌తో ఆడియెన్స్‌కు ఇంటి వాడిగా మారిపోవాలని ఆకాంక్షించారు. తాను కొత్తగా ట్రై చేసి, చాలా కష్టపడి ఈ సినిమా చేసినట్లు చెప్పారు. ఇక నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. అఖిల్ ఈసారి డిసప్పాయింట్ చేయరని చెప్పారు. ఫ్యాన్స్ అస్సలు అలాంటి ఆలోచన పెట్టుకోకుండా సినిమాకు రావాలని కోరారు. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను జూలై 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

