Mobile Popup Ad
Mobile Popup Ad

హుజూర్‌నగర్‌లో భారీ కార్డన్ సెర్చ్.. 51 వాహనాలు సీజ్

కలం, హుజూర్‌నగర్: సమాజ రక్షణే ధ్యేయంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు హుజూర్‌నగర్ (Huzurnagar) పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పట్టణంలో భారీ తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు.. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, స్థానిక ఎస్ఐ నరేశ్ నేతృత్వంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల నుంచే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో పాటు మొత్తం 100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

కాలనీలోని ప్రతి ఇల్లు, వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన రికార్డులు, అనుమతి పత్రాలు లేని కారణంగా మొత్తం 51 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 42 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలు, టాటా ఏస్ వాహనం ఉన్నాయి. ఈ సందర్భంగా కోదాడ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం, సమాజంలో నేరాలు జరగకుండా అరికట్టడంలో భాగంగానే తనిఖీలు చేపట్టామన్నారు.

పట్టణంలోకి వచ్చే కొత్త వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదని, సరైన గుర్తింపు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని, యువత వీటికి బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు. గంజాయి కాలనీల్లోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాలనీల్లో రక్షణ కోసం స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనదారులు రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడంతోపాటు, వాహనాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలను కలిగి ఉండాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>