కలం, వెబ్‌డెస్క్: ఈ కాలంలో దాదాపుగా ప్రతీఒక్కరి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉంటుంది. కూరగాయాలు, పండ్లు, పాలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు దాచుకునేందుకు ప్రతిఒక్కరూ ఫ్రిడ్జ్ ను ఉపయోగిస్తుంటారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందని మీకు తెలుసా? అవును కొంత మంది ఫ్రిడ్జ్ ను పైపైనే క్లీన్ చేసి వదిలేస్తారు. దీనివల్ల ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ వస్తుంది. లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా వల్లనే బ్యాడ్ స్మెల్ వస్తుందని చెబుతున్నారు నిపుణులు. అయితే కొన్ని టిప్స్ పాటించడం (Refrigerator Cleaning Tips) వలన ఫ్రిడ్జ్ ను ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పడు తెలుసుకుందాం.
ఫ్రిడ్జ్ ను వారానికి ఒకసారి సర్దడం, నెలకు ఒకసారి పూర్తిగా లోపల క్లీన్ చేయడం వలన బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అయితే మనం ఫ్రిడ్జ్ ను లోపల నుంచి క్లీన్ చేసే ముందు కొన్ని బేసిక్ స్టెప్స్ పాటించాలి. అవేమిటంటే.. ఫ్రిడ్జ్ ప్లగ్‌ను కరెంట్ బోర్డు ఉంచి తొలగించాలి. తర్వాత లోపల ఉన్న ఆహార పదార్థాలను బయటకు తీయాలి. ఫ్రిడ్జ్ లోని షెల్ఫ్‌లను కూడా వీడిగా తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేయాలి.
బేకింగ్ సోడా ఫ్రిడ్జ్ క్లీనింగ్
ఫ్రిడ్జ్ లో బ్యాక్టీరియాను పోగొట్టి దుర్వాసనను తగ్గించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో రెండు చెంచాల బేకింగ్ సోడా కలిపాలి. ఇప్పడు శుభ్రమైన క్లాత్ ను ఈ మిశ్రమంలో ముంచి ఫ్రిడ్జ్ లోపలి, బయటి భాగాలను క్లీన్ చేయాలి. తర్వాత పొడి క్లాత్ తీసుకుని ఆ భాగాలను తుడవాలి. ఇలా చేయడం ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ ఇట్టే మాయం అవుతుందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి.
నిమ్మరసం స్ప్రేతో ఫ్రిడ్జ్ క్లీనింగ్
వేడి నీళ్లలో కాస్త నిమ్మరసం కలిపి చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి ఫ్రిడ్జ్ లోపల స్ప్రే చేసి ఆపై పొడి గుడ్డతో క్లీన్ చేసి అరగంట సేపు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన పోయి ఫ్రిడ్జ్ ఫ్రెష్‌గా ఉంటుంది. నెలకు రెండు సార్లు ఇలా చేయడం వలన దుర్వాసన రాకుండా ఉంటుంది.
ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన షెల్ఫ్‌లను గోరు వెచ్చని నీటితో కడిగి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వాటిపై ఉన్న బ్యాక్టీరియా మాయం అవుతుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ నుంచి పాడైపోయిన పండ్లు, కుళ్లిపోయిన కూరగాయలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసేస్తూ ఉండాలి. వండిన ఆహార పదార్థాలను వేడివేడిగా ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టడం ఉత్తమం. ఫ్రిడ్జ్‌లో వస్తువులను ఒకదానిపై ఒకటి ఇరుకుగా పెట్టకుండా, గాలి ఆడేలా కొంత ఖాళీ ప్రదేశాన్ని ఉంచడం వల్ల ఫ్రిడ్జ్ ఎల్లప్పుడూ క్లీన్‌గా, హైజీనిక్‌గా ఉంటుంది. బేకింగ్ సోడా, నిమ్మరసం వాడకంతో పాటు ఈ చిట్కాలను పాటిస్తే ఫ్రిడ్జ్ దుర్వాసనను సులభంగా తగ్గించవచ్చు. ఈ చిట్కాలను (Refrigerator Cleaning Tips) పాటించి మీ ఫ్రిడ్జ్‌ను శుభ్రంగా ఉంచుకోండి.
Read Also: టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 తప్పులు చేస్తే ప్రమాదమే!
Follow Us On: Instagram

