Mobile Popup Ad
Mobile Popup Ad

దొంగల కుటుంబం ఆట కట్టు..

కలం, నిజామాబాద్ బ్యూరో : అది దొంగల ఫ్యామిలీ… ఇంట్లోని వారంతా దొంగలే. ఇంటి పెద్దావిడే దొంగల ముఠాకు బాస్​. బస్టాండ్ లలో ముసలి వారే ఆ కుటుంబం టార్గెట్.. ఎట్టకేలకు ఆ దొంగల ఫ్యామిలీ ఆట కట్టించిన నిజామాబాద్ (Nizamabad) పోలీసులు 10 లక్షల విలువైన 63 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో దొంగతనాలు చేస్తున్న ఓ కుటుంబం బాగోతం బట్టబయలైంది.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్నట్టు నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాశ్ యాదవ్ వెల్లడించారు. భైంసాకు చెందిన ఖతీజా బేగం (67) తన కూతురు నజ్మా బేగం, కొడుకు షేక్ అన్జద్ కుటుంబ సభ్యులు తహేరా, అబ్దుల్ జుబైర్, షేక్ వసీం అహ్మద్ లతో కలిసి దొంగల ముఠాగా ఏర్పడ్డారు. వీరు బస్టాండ్లలో రద్దీగా ఉండే సమయాల్లో బస్సులు ఎక్కే వృద్ధ మహిళలే లక్ష్యంగా చేసుకుని వారి మెడల్లోని బంగారు గొలుసులు కత్తిరించడం, బ్యాగుల నుండి నగదు, నగలు దొంగిలించడం చేసేవారు.

దొంగల ఫ్యామిలీ దొరికిందిలా..

జూన్ 17న నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట్ బస్టాండ్‌లో వంకర విజయలక్ష్మి (76) అనే వృద్ధురాలు బస్సు ఎక్కుతుండగా ఆమె మెడలోని బంగారు గుండ్ల తాడును కత్తిరించి ఎర్టిగా కారులో భైంసాకు పరారయ్యారు. ఈ ముఠా దొంగిలించిన బంగారాన్ని నిజామాబాద్ లో అమ్మేందుకు వస్తుండగా నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో కలిసి దాడిచేసి పట్టుకున్నారు.

గతంలో నిజామాబాద్ నందిపేట బస్టాండ్లలో కూడా బంగారు గాజులు, నెక్లెస్, పుస్తెలతాడులను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠాపై నవీపేట్, నిజామాబాద్ టౌన్-1, నందిపేట పోలీస్ స్టేషన్లలో మొత్తం 5 కేసులు ఉన్నాయి. వీరి వద్ద నుంచి రూ.10లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఎర్టీగా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>