Mobile Popup Ad
Mobile Popup Ad

టీడీపీకి కొత్త పేరు పెట్టిన అంబ‌టి..!

క‌లం, వెబ్ డెస్క్‌: వైసీపీని త‌ర‌చూ గొడ్డ‌లి పార్టీ అని విమ‌ర్శిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) కౌంట‌ర్ ఇచ్చారు. వైసీపీ గొడ్డ‌లి పార్టీ అయితే టీడీపీ త‌డిగుడ్డ‌ల పార్టీ అని అంబ‌టి అన్నారు. గుంటూరులో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీ అంటున్నార‌ని, అయితే త‌మ‌ది ప‌ర‌శురాముడి గొడ్డ‌లి అని ఇప్ప‌టికే చెప్పామ‌న్నారు. ఇక చంద్ర‌బాబు ఎవ‌రి గొంతైనా కోస్తే పోస్టు మార్టంలో కూడా రిపోర్ట్‌ దొర‌క‌ద‌న్నారు. వాళ్లే రౌడీల్లా దాడులు చేస్తూ త‌మ‌ను రౌడీ పార్టీ అని ముద్ర వేస్తున్నార‌న్నారు.

ఇప్పుడు పోలీసుల పైన కూడా దాడులు చేస్తున్నార‌ని చెప్పారు. ఇంత‌టి దుర్మార్గ‌మైన రాజ‌కీయాలు ఎవ‌రూ చేయ‌లేద‌న్నారు. సాయికృష్ణను లాకప్‌లోనే చంపి మృతదేహాన్ని కూడా మాయం చేశార‌ని ఆరోపించారు. ఇక సీఎం చంద్ర‌బాబు ఏ స‌భ పెట్టినా, ఎక్క‌డ మాట్లాడినా జ‌గ‌న్‌పై చౌక‌బారు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంబ‌టి విమ‌ర్శించారు. జ‌గ‌న్ మావిగ‌న్‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని చెప్ప‌డంతో చంద్ర‌బాబుకు నిద్ర ప‌ట్ట‌డం లేద‌న్నారు. క‌నీసం త‌ల్లిదండ్రుల‌కు కూడా గౌర‌వం ఇవ్వ‌ని చంద్ర‌బాబు జ‌గ‌న్ కుటుంబం గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>