కలం, వరంగల్ బ్యూరో : పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్ల సందర్భంగా ఒరిజినల్ టీసీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) సహకారం అందించారు. అధికారులతో మాట్లాడి విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.
వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ కౌన్సెలింగ్ సందర్భంగా రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో చదివిన మంచిర్యాల జిల్లాకు చెందిన డి.ఆశిత్‌తో పాటు మరో విద్యార్థి ఒరిజినల్ టీసీ అందుబాటులో లేక అడ్మిషన్ పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని వారు ఎంపీ కడియం కావ్య దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన ఎంపీ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఒరిజినల్ టీసీ సమర్పణకు కొంత గడువు ఇస్తూ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించి, విద్యార్థుల అడ్మిషన్‌కు అవసరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.
దీంతో అడ్మిషన్ కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊరట వ్యక్తం చేశారు. తమ సమస్యపై వెంటనే స్పందించి విద్యాభ్యాసం కొనసాగేందుకు సహకరించిన ఎంపీ కావ్య (Kadiyam Kavya)కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

