Mobile Popup Ad
Mobile Popup Ad

యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prashna Raavan) మళ్లీ అరెస్టయ్యారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన గంట వ్యవధిలోనే ఏలూరులో నమోదైన కేసులో భాగంగా వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో నాలుగు సార్లు రిమాండ్ తిరస్కరించినా కోర్టులు.. అతడికి బెయిల్ మంజూరు చేశాయి. బయటకు వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టవుతూ వస్తున్నారు.

డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలతోనే..

ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రావణ్ అలియాస్ బి.జోసెఫ్ ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ప్రధాన​ అభియోగం. దీనిపై మొదట పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా.. జులై ఒకటో తేదీన హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పిఠాపురం తరలించారు. అక్కడ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో మరో కేసులో సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్కడ బెయిల్ లభించి బయటకు రాగానే మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ జడ్జి తిరస్కరించడంతో యలమంచిలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ రావడంతో ఏలూరు వైపు వస్తుండగా ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21 ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదైనట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>