Mobile Popup Ad
Mobile Popup Ad

సుపారీ ఇచ్చి భర్త హత్య.. ఏడుగురు అరెస్ట్​

కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా సింగారం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పిట్టల యాకయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో యాకయ్య భార్య యశోదే ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు జిల్లా ఎస్పీ శభరీష్ వెల్లడించారు. భర్తను హత్య చేయించేందుకు రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ కేసులో భార్యతో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ మేరకు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘటన వివరాలు వెల్లడించారు. తన ఇంటి ఆవరణలో యాకయ్య నిద్రిస్తున్న సమయంలో నిందితులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మొదట గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు కనిపించినా, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలపై సేకరించిన సమాచారంతో అసలు కుట్ర బయటపడింది.

కుటుంబ విభేదాలు, వ్యక్తిగత కారణాలతో యశోద తన భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుని రూ.4 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ హత్య కేసులో భార్యతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కుట్రలో మరెవరైనా పాత్ర ఉన్నట్లయితే వారిపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>