కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రిలో (Rajahmundry) జరగనున్న గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) ఏర్పాట్లపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) సమీక్ష నిర్వహించారు. పుష్కరాల పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజమండ్రిలో గోదావరి పుష్కరాల పనుల కోసం రూ.580 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 11న పుష్కర పనుల కోసం నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల సమగ్ర అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.1,500 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఘాట్లు, రహదారులు, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నిర్వహణ వంటి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

