కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖలో 5 వేల పోలీస్ ఉద్యోగాలను ప్రకటించడంపై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు (Unemployed Protest) దిగారు. సీఎం రేవంత్ రెడ్డి 30 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. 5 వేల పోస్టులు ఎలా సరిపోతాయని.. కేటగిరీల వారీగా తీసేశాక ఒక్క జిల్లాకు ఒక్క పోస్ట్ కూడా రాదన్నారు. పోస్టులను వెంటనే 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న మాటలను ఈ సందర్భంగా వీడియోలతో ప్రదర్శించారు.
సీఎం అలా మాట్లాడొచ్చా.?
పురుగుల మందు తాగి, బావిలో దూకినా 5 వేల పోస్టులే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడుతారా.. అని పలువురు నిరుద్యోగులు ప్రశ్నించారు. తల్లిదండ్రులే తమను ఇలా ఎప్పుడు అనలేదన్నారు. సీఎం మీద చందానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాలని వెళితే.. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 5 వేల ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ వేస్తే.. ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Read Also: మోదీని చంపేస్తాం.. ఆ దేశం నుంచి బెదిరింపులు!
Follow Us On: Instagram

