కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో (IIIT Hyderabad) విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ (20) బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిరూప్ కుటుంబ సమస్యలతోనూ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన అభిరూప్ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
హాస్టల్ నుంచి దూకి..
శనివారం హాస్టల్ గదిలో ఉన్న అభిరూప్.. ఆరో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి దూకేశాడు. తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మరణించడంతో విద్యార్థులు షాకయ్యారు. వెంటనే ట్రిపుల్ ఐటీ (IIIT Hyderabad) అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతిపై అతడి కుటుంబసభ్యులకు కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది.
Read Also: అడ్లూరి vs కొప్పుల.. ధర్మపురిలో వేడెక్కిన రాజకీయం!
Follow Us On: X(Twitter)

