కలం, వెబ్ డెస్క్: లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ (Gade Saikrishna) తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని సీఐ నాగరాజు, కానిస్టేబుళ్లు మేకులు కొట్టి మరీ చంపేశారని, తమను కూడా చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ బూడిదైనా ఇవ్వాలని, లేకపోతే నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
సాయికృష్ణ ఘటన జరిగి ఇప్పటికీ రెండు నెలలవుతోందని, న్యాయం మాత్రం జరగలేదన్నారు. విచారణ తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందన్నారు. తన కుమారుడు నిజాయతీరుడని, అందుకే సీఐ నాగరాజు తీసుకొచ్చి కొట్టి చంపేశాడన్నారు. తనకు భూములు, డబ్బులు వద్దని.. న్యాయమే కావాలన్నారు.
వెనుక ఉన్నవారిని బయటకు లాగాలి..
తన కుమారుడిని అతి దారుణంగా చంపేయడం వెనుక ఉన్నవారు ఎవరో బయటకు తెలియాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. సాయికృష్ణను (Gade Saikrishna) ఇంటి నుంచి తీసుకెళ్లినవారు, తన ఫోన్ లాక్కున్నవారితో పాటు స్టేషన్లకు తిప్పించుకుంటూ కొట్టినవారిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. సీఐకి తనను కుమారుడిని చంపాల్సిన అవసరం ఏం ఉందని, దీని వెనుక పెద్దోళ్లు ఉన్నారని ఆరోపించారు. తాము కాపు కులస్థులమే అని, పవన్ కళ్యాణ్ కు ఓటేసినందుకు సరిగ్గా బుద్ధి చెప్పాడని మండిపడ్డారు.
Read Also: మైదానంలో తన్నారు.. కేప్ వెర్డేపై మెస్సీ కామెంట్స్!
Follow Us On : WhatsApp

