Mobile Popup Ad
Mobile Popup Ad

విటమిన్ ‘డి’ లోపమా? ఈ ఆహారాలతో చెక్ పెట్టండి

కలం, వెబ్ డెస్క్: విటమిన్ ‘డి’ (Vitamin D) అనేది మన శరీరానికి కావలసిన అత్యంత కీలకమైన పోషకం. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. శరీరం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డి తప్పనిసరి. సాధారణంగా మనం ఎండలో గడపడం వలన శరీరానికి అవసరమైన విటమిన్ ‘డి’ అందుతుంది. అందుకే విటమిన్ డి ను ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా అంటారు. అయితే వర్షాకాలంలో, చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి విటమిన్ డి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఎటువంటి ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కాలాల్లో విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ డి అనేది మనకు పాల ఉత్పత్తులు, వెజ్, నాన్ వెజ్ ఫుడ్స్ లో దొరుకుతుంది.

వెజ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే.. పుట్టగొడుగులో విటమిన్ డి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే చలికాలంలో తరచూ పుట్టగొడుగులు తినడం మంచిదని చెబుతున్నారు. అంతే కాకుండా స్నాక్స్ కు బదులుగా ఎండు ద్రాక్ష, ఎండిన ఆప్రికాట్, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిలో విటమిన్ డి పుష్క​లంగా ఉంటుంది.

నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే.. కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు విటమిన్ డి కి అత్యుత్తమ వనరులు. అంతే కాకుండా గుడ్డులోని పచ్చసొనలో కూడా విటమిన్ డి పుష్క​లంగా ఉంటుంది. అందుకే రోజులో 1 నుంచి 2 గుడ్లు తీసుకోవడం వలన విటమిన్ లోపం రాకుండా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇవే కాకుండా రెడ్ మీట్‌లో కూడా మంచి మొత్తంలో విటమిన్ డి ఉంటుంది.

పాల ఉత్పత్తుల్లో..

పాల ఉత్పత్తులలో కూడా విటమిన్ డి ఉంటుంది. ప్రతిరోజూ పాలు తాగడం, పెరుగు తినడం ద్వారా విటమిన్ డి లోపం రాకుండా జాగ్రత్త పడొచ్చు. అంతేకాకుండా పన్నీర్‌లో కూడా విటమిన్ డి ఉంటుంది. చలికాలంలో మన డైట్ ప్లాన్ లో ఈ ఆహారాలు చేర్చుకోవడం వలన విటమిన్ డి లోపాన్ని దూరం చేయవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>