కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేట (Siddipet) జిల్లాలో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ (DDRC) సమావేశంలో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ రఘునందన్ సమక్షంలో నేడు డీడీఆర్సీ సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై సుమారు ఆరు గంటలపాటు సమీక్ష కొనసాగింది.
కొందరు అధికారులు ఈ సమావేశం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించారు. సీరియస్గా మీటింగ్ జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు మొబైల్లో రీల్స్ చూస్తూ టైంపాస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

