Mobile Popup Ad
Mobile Popup Ad

పిల్లల్లో పోషకాల లోపానికి ‘ఎన్‌ఐఎన్’ ఈజీ సొల్యూషన్!

కలం,వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) శాస్త్రవేత్తలు పిల్లల్లో మైక్రోన్యూట్రియెంట్ (సూక్ష్మ పోషకాలు) లోపాన్ని సులభంగా గుర్తించేందుకు ఒక సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ప్రత్యేకంగా 13 రకాల ఆహార సమూహాలతో కూడిన ‘డైటరీ డైవర్సిటీ స్కోర్’ (Dietary Diversity Score)ను సంస్థ రూపొందించింది. పిల్లలు తీసుకునే రోజువారీ ఆహారంలో వైవిధ్యాన్ని అంచనా వేయడం ద్వారా వారి శరీరానికి అందుతున్న పోషకాలను లెక్కించడం ఈ స్కోర్ యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ పరిశోధన ప్రకారం, నిర్దేశించిన 13 ఆహార సమూహాలలో ఒక్కో గ్రూప్ నుండి పిల్లలు రోజుకు కనీసం 5 గ్రాముల పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటే దానికి ఒక టిక్ మార్క్ ఇవ్వబడుతుంది. ఇలా మొత్తం 13 పాయింట్లకు గాను 10 కంటే ఎక్కువ స్కోరు సాధించిన పిల్లలకు వారి శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలలో దాదాపు 70 శాతానికి పైగా అందుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల ప్లేటులో ఎలాంటి ఆహార పదార్థాలు ఉండాలో సులభంగా నిర్ణయించుకోవచ్చు.

ఎన్‌ఐఎన్ పరిశోధకులు అందించిన ఈ కొత్త డైటరీ డైవర్సిటీ స్కోర్ ద్వారా పిల్లల్లో పోషకాహార లోపాలను ముందే గుర్తించి, వారి ఎదుగుదలకు అవసరమైన మార్పులు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>