Mobile Popup Ad
Mobile Popup Ad

గోదావరి వరద ముంపు గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్: గత ఏడాది గోదావరి వరదల కారణంగా ముంపునకు గురైన దస్తూరాబాద్ మండలం గొడిసెర్యాల గ్రామాన్ని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) గురువారం సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ గ్రామ పెద్దలతో మాట్లాడి గత ఏడాది వరదల సమయంలో ఎదురైన ఇబ్బందులు, నష్టాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

భవిష్యత్తులో భారీ వర్షాలు, గోదావరి వరదలు సంభవించే అవకాశాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధంగా ఉంచాలని, ప్రమాదకర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ (Nirmal SP) అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సత్యనారాయణ, ఎస్సై సాయి పాల్గొన్నారు.

Read Also: తెలంగాణ గద్దెపై పాలమూరు బిడ్డ.. రాజకీయ జన్మకు మిడ్జిల్ అడ్డా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>