Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్​కోట్​ హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్​ నిజాలు!

క‌లం, వెబ్‌డెస్క్‌: గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ (Rajkot)లో వెలుగుచూసిన మ‌హిళ హ‌త్యా ఉదంతం వెనుక షాకింగ్ నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కేసులో 20 ఏళ్ల పీయూష్ కుమార్ ఖ‌ర్వార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. అస‌లు హ‌త్య‌కు గురైంది మ‌హిళ కాద‌ని, పీయూష్‌కు త‌న‌ను మ‌హిళ‌గా ప‌రిచ‌యం చేసుకున్న పురుషుడ‌ని తెలిసింది. వివ‌రాల్లోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌కు చెందిన పీయూష్‌కు హైద‌రాబాద్‌లో ఉన్న‌ప్పుడు త‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా చంద‌న్ కుమార్ అనే యువ‌కుడు ప‌రిచ‌యం అయ్యాడు. చంద‌న్ త‌న‌ను తాను ఫేస్‌బుక్ లో నిషా కుమార్‌గా, ఇన్‌స్టాలో పూన‌మ్‌గా ప‌రిచ‌యం చేసుకున్నాడు.

దీంతో చంద‌న్ మ‌హిళ అని భావించిన పీయూష్ లివింగ్ రిలేష‌న్‌షిప్‌కు అంగీక‌రించాడు. అయితే ప‌లుమార్లు పీయూష్ చంద‌న్‌ను శారీర‌కంగా క‌ల‌వాల‌ని ఒత్తిడి చేశాడు. కానీ చంద‌న్ మ‌త‌ప‌ర కార‌ణాలు చెప్తూ నిరాక‌రించాడు. ఈ క్ర‌మంలో ఒక రోజు చంద‌న్ షేవింగ్ చేసుకుంటూ పీయూష్ క‌ళ్ల‌కు చిక్కాడు. దీంతో అత‌డు అమ్మాయి కాదు అబ్బాయి అన్న విష‌యం పీయూష్‌కు తెలిసిపోయింది. ఇక ఒక్క క్ష‌ణం కూడా చంద‌న్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉండేది లేద‌ని గొడ‌వ పెట్టుకున్నాడు. అయితే చంద‌న్ పీయూష్‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, పీయూష్ ఎలాగైనా చంద‌న్ నుంచి త‌ప్పించుకోవాల‌ని హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆపై రాజ్‌కోట్ ఇలా ప‌లు ప్ర‌దేశాలు మారుతూ వ‌చ్చాడు.

ప్ర‌తి చోటా చంద‌న్ పీయూష్‌ను ఫాలో అయ్యి వేధించ‌సాగాడు. చివ‌ర‌కు జూన్ 21న రాజ్‌కోట్‌లోని ప‌డ‌వాలా గ్రామంలో చంద‌న్‌కు, పీయూష్‌కు మ‌ధ‌ తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. చంద‌న్ వేధింపులు త‌ట్టులేక‌పోయిన పీయూష్ అత‌డిని స్థానిక‌ రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్క‌డ బండ రాళ్ల‌తో త‌ల‌పై మోదీ అత‌డిని హ‌త్య చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో జూన్ 25న కుళ్లిన స్థితిలో మహిళా దుస్తుల్లో ఉన్న శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక‌ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ద‌ర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>