ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ X ఖాతా హ్యాక్.. లింకులు క్లిక్ చేయొద్దని సూచన

కలం, కరీంనగర్ బ్యూరో: ​కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoor Venkat) అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) సామాజిక మాధ్యమ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎమ్మెల్సీ ఖాతా నుండి హఠాత్తుగా ఒక కొత్త కారు కొనుగోలు చేసినట్లు, దానికి సంబంధించిన కోచ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఇంగ్లీషులో కొన్ని అనుమానాస్పద పోస్టులు ప్రత్యక్షమవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఖాతాపై ఈ వింత కార్యకలాపాలను గుర్తించిన వెంటనే ఎమ్మెల్సీ కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై, సంబంధిత ఐటీ విభాగం, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ​ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో హ్యాక్ అయిన అకౌంట్‌ను తిరిగి స్వాధీనం (రికవరీ) చేసుకునేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయి. బల్మూర్ వెంకట్ అధికారిక ఖాతా నుండి ప్రస్తుతం వచ్చే ఎలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని.. అక్కడ వచ్చే సందేశాలను, పోస్టులను అస్సలు నమ్మవద్దని అధికారులు, ఎమ్మెల్సీ ప్రజలను, అభిమానులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>