Mobile Popup Ad
Mobile Popup Ad

చైనాకు వెళ్తే ఫోన్ వదిలేస్తా.. ఇండియాకైతే వెంట తీసుకెళ్తా!

కలం, వెబ్ డెస్క్: అమెరికా, భారత్ దేశాల మధ్య ఉన్న దృఢమైన విశ్వాసాన్ని చాటిచెబుతూ యూఎస్ సెనేటర్ స్టీవ్ డైన్స్ (Steve Daines) ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా, మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. భద్రతా కారణాల దృష్ట్యా చైనాకు వెళ్లేటప్పుడు తన ఫోన్‌ను వాషింగ్టన్‌లోనే వదిలిపెట్టి వెళ్తానని, అదే ఇండియాకు వెళ్లేటప్పుడు మాత్రం ఎలాంటి అనుమానం లేకుండా తన ఫోన్‌ను వెంట తీసుకెళ్తానని పేర్కొన్నారు.

చైనా విషయంలో ఇలాంటి నమ్మకం ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. వాషింగ్టన్-బీజింగ్ మధ్య ఉన్న తేడాను ఈ సందర్భంగా ఎత్తిచూపారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి అమెరికా వ్యూహాత్మకంగా భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు. చైనా స్థాయి ఆవిష్కరణలకు దీటుగా నిలవగల శక్తి భారత్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>