Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ లో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

కలం, నిర్మల్ : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు వైద్యుడు డాక్టర్ సంతోష్ రాజును సన్మానించి పూల మొక్క అందజేసి వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమని, సమాజానికి వారు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. రోగుల ఆరోగ్య సంరక్షణలో వైద్యులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ మోడల్ విద్యా సంస్థల డీన్ రామదాసు , అకాడమిక్ కోఆర్డినేటర్ సాయినాథ్ , ప్రిన్సిపల్ జగతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>