Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్‌లో పర్మిషన్ లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: పీడీఎస్‌యూ

కలం, నిర్మల్ : ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారికి (DEO) వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయని, విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటూ, భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా నిర్మల్ (Nirmal), బైంసా పట్టణాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలన్నారు. సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also: వాట్సాప్ ‘యూజర్‌నేమ్ ఫీచర్‌’పై కేంద్రం అలర్ట్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>