వైభవ్ డెబ్యూపై శ్రేయస్ సస్పెన్స్.. మా చేతులు కట్టేశారు!

కలం, స్పోర్ట్స్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఎప్పుడు ఆడతాడు? ఇంగ్లండ్‌తో తొలి టీ20లో బరిలోకి దిగుతాడా? ఐర్లాండ్ సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన యువ సంచలనంపై మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తాయి. కానీ టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తన సమాధానంతో డెబ్యూపై ఉత్కంఠను మరింత పెంచేశాడు. ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశంలో వైభవ్ గురించి అడగగా, జట్టు కాంబినేషన్‌ను ఇప్పుడే చెప్పలేమని శ్రేయస్ స్పష్టం చేశాడు. తమ చేతులు కట్టేశారని, ప్లేయింగ్ ఎలెవన్ గురించి ముందే చెబితే ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందని తెలిపాడు. అందుకే జట్టు ప్రణాళికను రహస్యంగానే ఉంచుతున్నట్లు వివరించాడు.

వైభవ్‌పై భారీ నమ్మకం

వైభవ్ (Vaibhav Suryavanshi) అసాధారణ ప్రతిభ ఉన్న యువ ఆటగాడని శ్రేయస్ పేర్కొన్నాడు. అవకాశం వచ్చిన రోజు అతడు అద్భుతంగా రాణిస్తాడనే పూర్తి నమ్మకం తమకు ఉందని చెప్పాడు. అయితే ఆ అవకాశం ఎప్పుడు వస్తుందనే విషయంపై మాత్రం ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు స్థానిక బౌలర్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సహచరులు కఠిన పరీక్ష పెట్టినా ఆత్మవిశ్వాసంగా బ్యాటింగ్ చేశాడు.

ఫీల్డింగ్‌లోనూ అదుర్స్

ఫీల్డింగ్ డ్రిల్స్‌లో కూడా వైభవ్ మెరిశాడు. త్రోయింగ్ ప్రాక్టీస్‌లో దాదాపు ప్రతిసారి వికెట్లను నేరుగా తాకించాడు. ఫ్లాట్ క్యాచ్‌లు, హై క్యాచ్‌ల సాధనలో ఒక్క క్యాచ్ కూడా వదలకుండా కోచ్‌లను ఆకట్టుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో అవకాశం రాకపోయినా, ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు వైభవ్ మళ్లీ తన సత్తా చాటాడు. అయినా తుది నిర్ణయం మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంది.

Read Also: నాకౌట్ మ్యాచ్‌కు ముందు కేప్ వర్డే కెప్టెన్‌పై కేసు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>