కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (వైటీడీఏ) నూతన పాలక మండలిని (బోర్డు) (Yadagirigutta Temple Board) నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన బోర్డు ఛైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ బోర్డు పదవీ కాలం నియామక తేదీ నుండి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెండేళ్ల (02 సంవత్సరాలు) పాటు అమల్లో ఉంటుంది. ఈ నూతన కమిటీలో ఛైర్మన్‌తో పాటు మొత్తం 10 మంది సభ్యులు, 7 గురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. కాగా, త్వరలోనే నూతన పాలక మండలి ఛైర్మన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
పాలకమండలి ఇదే..
1. ఎం. సత్యనారాయణ రెడ్డి (ఛైర్మన్)
2. వినోద్ వెంకటస్వామి, MLA (సభ్యులు)
3. కొణిదెల సురేఖ, మెగాస్టార్ చిరంజీవి భార్య (సభ్యులు)
4. చిలపగారి విజయరాజం (సభ్యులు)
5. విజయేందర్ తుల్ల (సభ్యులు)
6. పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ (సభ్యులు)
7. గుండు మల్లయ్య (సభ్యులు)
8. స్వాతి కాంతమణి (సభ్యులు)
9. ఎం. రాఘవేందర్ రావు (సభ్యులు)
10. డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ (సభ్యులు)
11. ది ఫౌండర్ ట్రస్టీ (సభ్యులు)
ఎక్స్-అఫీషియో సభ్యులు వీళ్లే..
12. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం
13. ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ, తెలంగాణ ప్రభుత్వం
14. కమిషనర్, దేవాదాయ శాఖ, తెలంగాణ
15. జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా
16. వైస్ ఛైర్మన్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ
17. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ), యాదగిరిగుట్ట దేవస్థానం
18. స్థానాచార్య లేదా సీనియర్ మోస్ట్ ప్రధాన అర్చకులు

