Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్‌పై బీజేపీ మండిపాటు

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) మున్సిపల్ కౌన్సిల్ లో ఒక వర్గానికే కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకొని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 42 వార్డులలో నెలకొన్న అనేక సమస్యలను పక్కన బెట్టి కేవలం మైనారిటీ వర్గానికి కొమ్ముకాసేలా ఎజెండాలు రూపొందించడం సరికాదన్నారు.

బక్రీద్ పండగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారిన ఈద్గా అభివృద్ధి కోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి రూ. 50 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని అనేక కాలనీల్లో రోడ్ల పైకి నీరు చేరుతుందని, ఇటువంటి అత్యవసర పనుల గురించి కౌన్సిల్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదని మండిపడ్డారు. కేవలం మైనారిటీల కోసం ప్రజాధనాన్ని కేటాయించి హిందువులకు అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.

ఒకవైపు అనేక కాలనీల్లో రోడ్లు డ్రైనేజ్ లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం 21వ వార్డులో ప్రజలు నివసించని ప్రాంతంలో రూ.50 లక్షలతో డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించడం సరికాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులతో అన్ని వార్డ్ లలో సమానంగా అభివృద్ధి పనులు చేయాలన్నారు. తక్షణమే కౌన్సిల్ లో పేర్కొన్న హిందూ వ్యతిరేక ఎజెండాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు సాదం అరవింద్, కౌన్సిలర్లు శ్రీరామోజీ నరేష్, జింక సూరి, కూన శశాంక్, విఠల్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>