Mobile Popup Ad
Mobile Popup Ad

జపాన్ ఆటగాడిపై కున్హా అనుచిత సంజ్ఞలు?

కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్-2026లో బ్రెజిల్ విజయోత్సాహం మధ్య జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. జపాన్ ఆటగాడు కెంటో షియోగై వైపు బ్రెజిల్ ఫార్వర్డ్ మాథ్యూస్ కున్హా (Matheus Cunha) చేసిన సంజ్ఞపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బ్రెజిల్ చివరి నిమిషాల్లో విజయం సాధించి రౌండ్ ఆఫ్-16కు చేరుకుంది. గాయం సమయాల్లో వచ్చిన గోల్‌తో మ్యాచ్‌ను గెలిచిన అనంతరం కున్హా తన జెర్సీపై ఉన్న బ్రెజిల్ గుర్తును చూపిస్తూ, మరో చేతితో ఐదు వేళ్లు ప్రదర్శించాడు. ఈ దృశ్యాలు టెలివిజన్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ చర్య జపాన్ ఆటగాడు కెంటో షియోగై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు.

షియోగై గతంలో బ్రెజిల్ ఇప్పుడు ఫుట్‌బాల్‌లో పూర్వపు ఆధిపత్య జట్టు కాదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మ్యాచ్ అనంతరం కున్హా తన చర్యను సమర్థించుకున్నాడు. బ్రెజిల్ జట్టు చరిత్ర, ఆ జెర్సీకి ఉన్న గౌరవం దృష్టిలో పెట్టుకుని తాను అలా స్పందించినట్లు మీడియాతో చెప్పాడు. అలాంటి వ్యాఖ్యలు ఒక బ్రెజిల్ ఆటగాడు చేస్తే వేరే విషయం అని, కానీ ఇతర దేశాల ఆటగాళ్లు చేస్తే మొత్తం జట్టు కలిసి స్పందిస్తుందని వివరించాడు. తాము ధరించే జెర్సీ వెనుక ఉన్న గొప్ప వారసత్వాన్ని గుర్తు చేయడమే తన ఉద్దేశమని తెలిపాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా వరుస పోస్టులు చేశాడు.

జపాన్‌పై విజయం సాధించిన ఫొటోలను పంచుకుంటూ, ఇప్పుడు మా గురించి మరింత తెలుసుకున్నారని ఒక పోస్టులో రాశాడు. మరొక పోస్టులో ఎవరికీ తాము ఎక్కువ కాదని, తక్కువ కాదని పేర్కొన్నాడు. బ్రెజిల్ జెండా ఎమోజీని కూడా జత చేశాడు. అయితే, మరోవైపు కున్హా మానవత్వాన్ని చూపించిన ఘటన కూడా కనిపించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే సంబరాల్లో పాల్గొంటున్న తన సహచరులను వదిలి, ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న జపాన్ మిడ్‌ఫీల్డర్ ఆఓ తనాకాను ఓదార్చాడు. జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంతో తీవ్ర నిరాశలో ఉన్న తనాకాకు ధైర్యం చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>