Mobile Popup Ad
Mobile Popup Ad

స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రియాంక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పేద విద్యార్థులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) తెలిపారు. మంగళవారం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్, కాలేజీ బాలురు దామరాగిద్ద పాఠశాల సింగారం గెట్ సమీపన గల స్కూళ్లను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల్లో అదనంగా నిర్మించిన గదులను పరిశీలించారు.

పాఠశాల్లో ఇంకా అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ గోడ, కిటికీలు ఇంకా మౌలిక సదుపాయాలపై అరతీశారు. ఇంటర్మీడియట్, టెన్త్ విద్యార్థులతో మాట్లాడి, వారి భవిష్యత్ విజయాల కోసం కొన్ని సూచనలు చేశారు. పదవి తరగతిలో గణితం తరగతిని విని, పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగారు తెలుసుకున్నారు. విద్యార్థుల ద్వారా వచ్చిన జవాబులపై సంతృప్తి చెందారు. అనంతరం స్నానాల గది, భోజనశాల, వంటగదిని సందర్శించారు. పాఠశాలకు గదులు వసతులపై అడిగి తెలుసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>