Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ హైకోర్టులో కొడాలి నానికి బిగ్ రిలీఫ్

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని (Kodali Nani)కి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఏపీ ప్రభుత్వం కొడాలి నానిపై అనుమతించిన ప్రాసిక్యూషన్‌పై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి కొడాలి నానిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

కాగా, 2021 ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై కొడాలి నాని (Kodali Nani) అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియామావళి ఉల్లంఘన కింద నానిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక ఇవ్వగా.. 2021 ఫిబ్రవరి 16న పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కూటమి ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతించగా.. తాజాగా ఆ కేసులో కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో కొడాలి నానికి బిగ్ రిలీఫ్ దక్కినట్లైంది.

Read Also: విద్యా సంస్కరణలపై కేంద్ర మంత్రితో లోకేశ్ సమీక్ష

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>