కలం, సినిమా : అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (Lenin) సినిమా ట్రైలర్ లాంచ్ ఈరోజు విశాఖపట్నంలో ఘనంగా జరగనుంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో అఖిల్ అక్కినేని పాల్గొని సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్లో ప్రారంభం కానుంది. భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్న ఈ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం అభిమానులను ట్రైలర్ లాంచ్ వేడుకకు ఆహ్వానిస్తూ, ఉత్సాహభరితమైన సాయంత్రానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే అభిమానులు నిర్వాహకులు అందుబాటులో ఉంచిన పాస్‌లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాను మురళీ కిశోర్ అబ్బుర తెరకెక్కిస్తుండగా, క్యూట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటించింది. ‘లెనిన్’ మూవీ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ట్రైలర్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

