Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతిరోజు గుడ్డు తింటున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పండ్లు, కూరగాయలు ఎంత అవసరమో.. సమతుల్య ఆహారం కోసం గుడ్లు (Egg) కూడా అంతే ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. ‘మల్టీవిటమిన్’గా పిలవబడే గుడ్డులో అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కనీసం నెల రోజులపాటు ప్రతిరోజూ గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని అమైనో ఆమ్లాలు కండరాల నిర్మాణానికి, వాటి పునరుజ్జీవనానికి తోడ్పడతాయి. రోజంతా అలసట లేకుండా చురుగ్గా ఉండేందుకు ఉదయం పూట గుడ్డు తినడం మేలు చేస్తుంది.

శారీరక శక్తితోపాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలోనూ గుడ్డు (Egg) కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ‘కోలిన్’ పోషకం జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని ఎంతగానో పెంచుతుంది. ఇది విద్యార్థులకు, మానసిక శ్రమ ఎక్కువగా ఉండేవారికి అద్భుతమైన బ్రెయిన్ ఫుడ్‌లా పనిచేస్తుంది. అంతేకాదు గుడ్డులో ఉండే విటమిన్ B7 చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. బాహ్య సౌందర్యంతోపాటు అంతర్గత ఆరోగ్యం కోసం రోజుకో గుడ్డు తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.

Read Also: ఇక ఆకాశ మార్గంలో రయ్ రయ్.. ఎగిరే ట్యాక్సీలు వచ్చేస్తున్నయ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>