epaper
Friday, January 16, 2026
spot_img
epaper

డీకే అరుణను టార్గెట్ చేసిన కవిత

కలం, వెబ్ డెస్క్: పాలమూరు ఎంపీ డీకే అరుణను కవిత (Kavitha) టార్గెట్ చేశారు. గద్వాల ప్రాంతాన్ని ఆమె ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దశాబ్దాలుగా డీకే అరుణ కుటుంబసభ్యులు గద్వాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారని.. కానీ ఈ ప్రాంతాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని కవిత మండిపడ్డారు. తాను ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే కండ్ల నీళ్లు వస్తున్నాయన్నారు. దేశంలో అక్షరాస్యతలో గద్వాల జిల్లా అత్యంత వెనకబడిందని చెప్పారు.

కేటిదొడ్డిలో అతి తక్కువ అక్షరాస్యత

గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి అనే మండలంలో దేశంలోనే అత్యంత తక్కువ మహిళా అక్షరాస్యత ఉందని కవిత (Kavitha) పేర్కొన్నారు. తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని.. జిల్లా మొత్తం తిరిగి అధ్యయనం చేసి ఈ విషయాలు మాట్లాడుతున్నానని చెప్పారు. ‘దేశ‌ వ్యాప్తంగా అక్షరాస్యత రేటు 80 శాతంగా ఉంటే తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 76.9 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 69 శాతంగానే ఉంది. అందులో గతేడాది మహిళల అక్షరాస్యత 65.9 శాతం ఉంటే 2025 నాటికి 61.1 శాతానికి చేరింది. ఇక గద్వాల్(Gadwal) లో అయితే పురుషులు 49.8 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. అందులో మహిళల అక్షరాస్యత 39.4 శాతంగా ఉంది. కేటిదొడ్డి మండలంలో అయితే 33.77 శాతం అక్షరాస్యత ఉంటే అందులో మహిళలు 23 శాతమే. గద్వాల జిల్లాపై పాలకులు తీవ్ర వివక్ష చూపిస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు.

రేవంత్ ఈ ప్రాంతాన్ని పట్టించుకోరా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వాడినని నిత్యం చెప్పుకుంటారని మరి ఈ ప్రాంతం మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు.  దేశంలో అతి తక్కువ అక్షరాస్యత గద్వాల జిల్లాలోనే నమోదైందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) తన సొంతజిల్లా మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్ హౌస్‌ను కవిత పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

వలస జిల్లాలో ఏం మారింది?

పాలమూరు(Palamuru) వలస జిల్లా అంటూ చూపించుకొని గత పాలకులు ప్రపంచబ్యాంక్ వద్ద నిధులు తెచ్చుకున్నారని.. కానీ ఈ ప్రాంతాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు గద్వాల జిల్లా ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా అలాగే ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదని.. అందుకే ఇక్కడ అక్షరాస్యత శాతం విపరీతంగా పడిపోయిందని పేర్కొన్నారు.

Read Also: ప్రాణం పోయినా బీఆర్​ఎస్​లోకి వెళ్లను : కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>