Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్.. 115 వాహనాలు సీజ్

కలం, కరీంనగర్ బ్యూరో: తప్పు నంబర్ ప్లేట్లు, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు, నంబర్ ప్లేట్లు లేని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి ఆధ్వర్యంలో జిల్లా ట్రాఫిక్ పోలీసులు (Karimnagar Traffic Police) స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కరీంనగర్ లో ట్రాఫిక్ నిబంధనల అమలు, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శనివారం వన్‌టౌన్ కార్నర్ వద్ద చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లు, తప్పుగా అమర్చిన నంబర్ ప్లేట్లు, అలాగే నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 115 వాహనాలను సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం సంబంధిత నిబంధనల మేరకు జరిమానాలు విధించడంతో పాటు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి మాట్లాడుతూ.. ప్రతి వాహనానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా స్పష్టంగా కనిపించే హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ (HSRP) ఉండాలని తెలిపారు. నంబర్ ప్లేట్లను మార్చడం, స్టిక్కర్లు లేదా ఇతర డిజైన్లతో నంబర్లు కనిపించకుండా చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్యతో పాటు ట్రాఫిక్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>