కలం, వెబ్ డెస్క్ : చంద్రబాబు, లోకేష్ పథకం ప్రకారమే అమరావతి పరిధిలోని పెనుమాక రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తమపై ఉండవల్లి సెంటర్ లో గుండాలు, రౌడీలతో దాడులు జరిగాయని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆరోపించారు. తమపై దాడి చేసినోళ్లలో ఒక్క రైతు కూడా లేడని తెలిపారు. గుండాలు, రౌడీలను కావాలనే దాడికి తీసుకొచ్చి వైసీపీ నాయకులపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.
అమరావతిలో (Amaravati) జరిగే అకృత్యాలు బయటకు రాకూడదనే చంద్రబాబు, లోకేష్ ఇలా చేయించారని పేర్ని నాని (Perni Nani) పేర్కొన్నారు. లోకేష్ గుండెకాయో, కుడి చేయో.. ఏమో తనకు తెలియదని.. కానీ అతడే ఇవాళ దాడికి నాయకత్వం వహించాడని తెలిపారు. జగన్ దగ్గరికి వెళ్లిన రైతుల్లో ధైర్యాన్ని చంపేయాలి, వైసీపీ నాయకులని భయబ్రాంతుల్ని చేయాలని వారు భావించారని అన్నారు.
వైసీపీ నాయకులు సైలెంట్ గా వెళ్లిపోతే భూములు లాక్కోవచ్చని టీడీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మరి ల్యాండ్ పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తమపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని , వాహనాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
Read Also: ఏపీ ఎయిర్‌పోర్టుల్లో లిక్కర్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
Follow Us On: Instagram

