Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవ్ వస్తున్నాడు.. సంజూ శాంసన్‌కు మంజ్రేకర్ హెచ్చరిక!

కలం, స్పోర్ట్స్​ : ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా.. బెల్‌ఫాస్ట్‌లో శుక్రవారం జరిగిన పోరులో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో సిరీస్‌లో భారత్ వెనుకంజలో పడింది. అదే సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వైఫల్యంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) స్పందించారు.

కొద్దిరోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్.. ఐర్లాండ్‌పై మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో అతను జాగ్రత్తగా ఆడాలని సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) హెచ్చరించారు. భారత జట్టులో చోటు కోసం విపరీతమైన పోటీ ఉందని, ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడని గుర్తుచేశారు.

శాంసన్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా ఫామ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తొలి మ్యాచ్‌లో ప్రపంచకప్ హీరోలైన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌ల ఓపెనింగ్ జోడీని కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. దీంతో వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, ఆదివారం జరిగే రెండో టీ20లో సూర్యవంశీకి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో మంజ్రేకర్ తన విశ్లేషణను పంచుకున్నారు.

మొదటి మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో మొదటి ఆరు ఓవర్లలోనే దూకుడుగా ఆడాల్సి వచ్చిందని, ఇరుకైన పరిస్థితుల వల్ల అది ఎవరికైనా కష్టమేనని చెప్పారు. వైభవ్ బరిలోకి దిగినా కూడా ఫలితంలో పెద్దగా మార్పు వచ్చేది కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దంబుల్లాలో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో కూడా వైభవ్ సిక్సర్లు కొట్టడానికి ఇబ్బంది పడిన విషయాన్ని మంజ్రేకర్ గుర్తుచేశారు. ప్రస్తుతం భారత జట్టులో టాప్ ఆర్డర్‌లో స్థానం ఖాళీగా లేదని, ఒకవేళ వైభవ్‌ను ఆడించాలనుకుంటే మిడిల్ ఆర్డర్‌లో మాత్రమే అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషించారు.

Read Also: వాషింగ్టన్ సుందర్‌కు సరైన పాత్ర ఇవ్వట్లేదు: అశ్విన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>