Mobile Popup Ad
Mobile Popup Ad

పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతున్న బాధితులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వివాహవేడుకల్లో విందు భోజనం తిన్నవారిలో 41 మందికి ఫుడ్ పాయిజన్ (Food Poisoning) అయిన ఘటన మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. న్యూ మోతి నగర్ లో ఈనెల 25న వివాహం జరిగిన ఇంట్లో తయారు చేసిన “కద్దు ఖీర్ ” ను పెళ్లికి వచ్చిన వారు తిన్నారు. అయితే, వికటించడంతో 41 మందికి కడుపునొప్పితో కూడిన వాంతులు అయ్యాయి.

దీంతో హుటాహుటిన బాధితులను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో 26 మంది పిల్లలు, ఒక గర్భిణీ ఉన్నారు. ఈ విషయమై శనివారం జిల్లా  వైద్యారోగ్య శాఖాధికారి డా. ఏ. శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంహెచ్ వో డా. శశికాంత్ సందర్శించి అస్వస్థతకు (Food Poisoning) గురయిన వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

పూర్తిగా ఆరోగ్యం కుదుట పడగానే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) శుక్రవారం రాత్రి జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

Read Also: అలర్ట్.. ఆహార పరిశుభ్రతలో హైదరాబాద్‌కు చిట్ట చివరి స్థానం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>