కలం, వెబ్ డెస్క్ : ‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి కళ్లు వాడి ఇష్టం’ అంటూ ఇటీవల సింగర్ సునీత (Singer Sunitha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. సునీత వ్యాఖ్యలపై మరో సింగర్ చిన్మయి శ్రీపాద అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీత వ్యాఖ్యల వల్ల మహిళలకు మరింత నష్టం జరుగుతోందని .. ఆమె మాటలను ఆదర్శంగా తీసుకొని ‘మై యాసిడ్, మై ఛాయిస్’ అంటూ కొందరు అబ్బాయిలు మహిళలపై తెగబడితే ఎలా అని మండిపడ్డారు. అయితే తాజాగా చిన్మయి చేసిన వ్యాఖ్యలకు సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సింగర్ గా చిన్మయి అంటే ఎంతో గౌరవం ఉందని, అయితే తన మాటలు మహిళలకు డ్యామేజ్ చేసేలా ఉన్నాయని చిన్మయి అనడం కరెక్ట్ కాదని సునీత అన్నారు. ‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి కళ్లు వాడి ఇష్టం’ అని తాను అన్నానని సునీత అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న సొసైటీని బట్టే తాను ఆ కామెంట్ చేశానని చెప్పారు. అంతేకానీ, ‘నా చేయి, నా ఇష్టం’ అంటూ మహిళలపై తప్పుగా ప్రవర్తిస్తే వారి చేతులు నరికే వారిలో ముందుగా తానుంటానని స్పష్టం చేశారు. ఒకప్పుడు తనకు కూడా కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యాయన్న సునీత.. అసలు తాను ఏ ఉద్దేశంలో అలా అన్నానో ఇంటర్వ్యూ మొత్తం చూస్తే చిన్మయికి అర్థం అవుతుందని సూచించారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: Instagram

