Mobile Popup Ad
Mobile Popup Ad

బాహుబలి-3.. ప్రకటించిన ప్రభాస్, అనుష్క, రానా

కలం, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సినిమా “బాహుబలి”. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా పేరున్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పటివరకు అపజయాన్ని చవిచూడని జక్కన్న భారీ అంచనాలతో తీసిన సినిమా ఇది. “బాహుబలి ది బిగినింగ్” మొదటి పార్ట్‌తో అభిమానుల్లో జోష్ నింపిన డైరెక్టర్ రాజమౌళి.. “బాహుబలి – 2 ది కంక్లూజన్” పేరుతో సినిమాను డైరెక్ట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్‌ను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఎవరూ ఊహించని రీతిలో బాహుబలి సెకండ్ పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. భారీ వీఎఫెక్ట్స్, దేశంలోని రాజనీతి, క్షత్రియ గుణాలను పీక్ స్టేజ్‌లో ప్రతిభింభించేలా నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం హైలైట్. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ నెట్టింట చెక్కర్లు కొడుతోంది.

బాహుబలి-3పై బిగ్ అప్‌డేట్..

ఇటీవల ఓటీటీలో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో బాహుబలి సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క, ప్రతినాయకుడు రానా ముచ్చటించారు. ఈ క్రమంలోనే బాహుబలి -3 పై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే బాహుబలి – 3 (Baahubali – 3) ఉంటుందని వారు వెల్లడించారు. “ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. మీ అందరికోసం బాహుబలి – 3 రాబోతుంది” అని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ముగ్గురి ప్రకటనతో బాహుబలి – 3పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలయింది. డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న బాహుబలి -3లో కథాంశం ఎలా ఉండబోతుంది? ఈ సినిమాను రాజమౌళి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఎన్నేళ్లు పడుతుంది? అనే చర్చ సినీ అభిమానుల్లో ఊపందుకుంది.

Read Also: చిన్మయికి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్

Follow Us On: X(Twitter

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>