కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మాచన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని (Indiramma House) ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు లేని గ్రామాలను నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబం కూడా గౌరవంగా జీవించేలా పక్కా ఇళ్లు కల్పించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా, రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. “ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం” అని యెన్నం (MLA Yennam ) స్పష్టం చేశారు. గ్రామాల్లో గుడిసెలు, పెంకుటిల్లు లేకుండా పక్కా ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గొర్రెల కాపరులు సహకార సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మాచన్ పల్లి గ్రామ సర్పంచ్ మన్యంకొండ, పొతన్ పల్లి గ్రామ సర్పంచ్ మాధవ రెడ్డి, రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ బాబురావు , మాచన్ పల్లి ఉపసర్పంచ్ కృష్ణయ్య , నాయకులు సాయిలు యాదవ్, భాస్కర్ రెడ్డి, గోవింద్ యాదవ్, నర్సింహులు యాదవ్, సాయిలు, శ్రీశైలం, సత్యం మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

