Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఆపరేషన్ సిందూర్’ వీరులు వీరే.. తొలిసారి పేర్లు వెల్లడించిన కేంద్రం!

కలం, వెబ్ డెస్క్ : దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) లో భాగంగా వీరమరణం పొందిన ఆరుగురు జవాన్ల పేర్లను కేంద్రం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సైనికుల పేర్లను చేర్చారు. దేశం కోసం సర్వోన్నత త్యాగం చేసిన వారిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది, ఒకరు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఈ అమరవీరుల పేర్లను త్వరలోనే లిఖించనున్నారు.

ఈ ఆపరేషన్‌లో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ దేశ రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారితో పాటు లాన్స్ నాయక్ దినేష్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ కూడా వీరమరణం పొందారు. ఈ జాబితాలో అగ్నివీర్ మురళీ నాయక్ కూడా ఉండటం గమనార్హం. అలాగే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ ఈ ఆపరేషన్‌లో అమరుడయ్యారు. దేశ సరిహద్దుల్లో వీరు చూపిన శౌర్య పరాక్రమాలకు గుర్తుగా, భావితరాలకు వీరి త్యాగాలు తెలిసేలా జాతీయ యుద్ధ స్మారక స్థూపంపై వీరి పేర్లను లిఖించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>