కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు (CI Nagaraju)ను 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సిట్ అధికారులకు చుక్కెదురైంది. నాగరాజు కస్టడీ కోసం వేసిన పిటిషన్ ను విజయవాడ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది.
కస్టోడియాల్ టార్చర్ వల్లే సాయికృష్ణ (Sai Krishna) మరణించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుకు సీఐ నాగరాజు (CI Nagaraju) సహకరించడం లేదని, దీనివల్ల అతన్ని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సిట్ అధికారులు కోరారు. అయితే సిట్ అధికారులు చేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు కు సమయం ఇవ్వాలని నాగరాజు తరుఫు లాయర్ కోర్టును అభ్యర్థించారు. దీంతో సిట్ అధికారులు వేసిన పిటిషన్ విచారణను న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది.
Read Also: ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
Follow Us On: Instagram

