కలం, వెబ్ డెస్క్: పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం (Citizenship) ఉన్నట్లు కాదని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొనడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ప్రజల వద్ద ఉన్న ఏ డాక్యుమెంట్లు కూడా పౌరసత్వం ఉన్నట్లు రుజువు కాదని.. 2030 నాటికి బీజేపీ సభ్యత్వ కార్డు ఉన్నవారికే అసలైన పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించబోతున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బీజేపీ ఐడీ కార్డులను పోస్టు చేశారు. ఒక వ్యక్తి పౌరసత్వం నిరూపణకు పాస్‌పోర్ట్‌ను మించిన ఆధారం ఏం ఉంటుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇలాంటి గందరగోళ నిర్ణయాల వలన తాము ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. పౌరసత్వం, గుర్తింపు కార్డుల పేరుతో రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) హితవు పలికారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On : WhatsApp

