కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయసహకారాలు అందించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని, తీర్పును గెలుచుకోలేని వారు ఓటర్ల జాబితాల్లో గందరగోళం సృష్టిస్తారని చెప్పారు.
ఓట్లను తొలగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించిన సందర్భాలను ఇటీవల పలు రాష్ట్రాల్లో చూశామని.. అలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలకు తెలంగాణలో తావు లేదని స్పష్టం చేశారు. బూత్ లెవల్ అధికారులు (BLO) ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా సహకరించాలని ప్రజలను కోరారు. తమ పేరు, చిరునామా, కుటుంబ వివరాలు, ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సమాచారాన్ని అందించాలని మంత్రి పొంగులేటి (Ponguleti) చెప్పారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: X(Twitter)

