Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్డీఎస్‌లో తెలంగాణ నీటి వాటాను కాపాడాలి.. కవిత డిమాండ్

కలం, వెబ్ డెస్క్: తుంగభద్ర, ఆర్డీఎస్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ రెడ్డి మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలిబండ డైవర్షన్ స్కీం (RDS Project) చుట్టు కర్ణాటక చేపట్టే ప్రాజెక్ట్‌లతో మనం నీటి హక్కును కోల్పోతామని చెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నాడని ఆరోపించారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వెళ్లోద్దని.. సెంట్రల్ వాటర్ కమిషన్ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.

6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదు..

తెలంగాణ ఏర్పడి పుష్కరకాలం గడిచినా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదని కవిత చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయవద్దని కోరారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ తెలంగాణ నడిగడ్డను బతికించి.. ఉమ్మడి మహబూబ్ నగర్ కు ఉపయోగపడే ప్రాజెక్ట్ అని తెలిపారు. ఆర్డీఎస్ లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదని అన్నారు. దురదృష్టవశాత్తు ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ సర్కార్ (Revanth Reddy) దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి వెళ్లొద్దు..

ఆర్డీఎస్‌కు ఎగువన, దిగువ 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతోందని కవిత చెప్పుకొచ్చారు. కర్ణాటకకు ఆర్డీఎస్ లో 1.20 వాటా నీళ్లు మాత్రమే ఉన్నాయని.. కానీ 10 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. అలాంటి కార్యక్రమానికి మన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబు, డీకే శివకుమార్ లను కూర్చొబెట్టుకోని తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఈ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే తుంగభద్రలో మన వాటా హక్కును పర్మినెంట్‌గా కోల్పోతామని చెప్పారు. ఉమ్మడి మహబాబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాను కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని అన్నారు. ఒకవేళ వెళితే అదే స్టేజీ మీద బనకచర్ల కట్టమని ఏపీ సీఎంతో చెప్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ మూడు ప్రాజెక్ట్‌లు రద్దు చేసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కును కోల్పోయే ప్రమాదకరమైన పనికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వొద్దన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>