Mobile Popup Ad
Mobile Popup Ad

నార్కట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో ఉచిత రక్త పరీక్ష కేంద్రం ప్రారంభం

కలం, నార్కట్‌పల్లి : ప్రజలకు ఎంత వీలైతే అంత ఎక్కువగా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. నల్గొండ (Nalgonda) జిల్లా నార్కట్‌పల్లి (Narketpalle) ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సంఘ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్ష కేంద్రాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రకాల వ్యాధులు మనుషులను వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉచిత రక్త పరీక్షల ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ముందస్తుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహిళా సంఘ సభ్యులు అందరూ ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో రూ.200 కోట్ల భారీ వ్యయంతో ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఉదయం పూట నాణ్యమైన టిఫిన్, మధ్యాహ్నం రుచికరమైన భోజనం అందిస్తున్నామని గుర్తుచేశారు.

ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నందున, ప్రజలు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>