Mobile Popup Ad
Mobile Popup Ad

7 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులు: కరీంనగర్‌ సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందాలని కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు అందిస్తున్న ఏడు ఏజెన్సీలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్-1 టౌన్, కరీంనగర్-2 టౌన్, చొప్పదండి పోలీస్ స్టేషన్ పరిధుల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏజెన్సీల ద్వారా దాదాపు 146 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల యజమానులు చట్టబద్ధమైన అనుమతులు, లైసెన్సులు పొందిన తర్వాతే కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>