Mobile Popup Ad
Mobile Popup Ad

‘ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి’.. రైతు సంఘం డిమాండ్

కలం, మెదక్ బ్యూరో : వానాకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ఎరువుల సరఫరా పెంచి, ధరలను నియంత్రించాలని సంగారెడ్డి (Sangareddy) రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రైతు సంఘాల ఆధ్వర్యంలో పోతిరెడ్డి పల్లి లో ఉన్న ఆగ్రోస్ కేంద్రాన్ని గొల్లపల్లి జయరాజు పరిశీలించారు .

ఈ సందర్బంగా అధ్యక్షులు జయ రాజు మాట్లాడుతూ.. వానకాలం సీజన్ కు అవసరం అయినా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని , కందులు, పెసలు, మినుములు, సొయా, జీలుగా విత్తనాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఆగ్రోస్ కు అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందించాలని కోరారు. రైతులకు ప్రస్తుతం యూరియా ,డీఏపి ఎరువులు కూడా దొరకడం లేదన్నారు.

యూరియా యాప్ ను తీసేయాలని డిమాండ్ చేశారు. యూరియా , డీఏపి సరఫరా పెంచి , ధరలు నియంత్రించాలని అన్నారు. యూరియా, డీఏపి ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారుల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, నాయకులు యాదయ్య, శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>