Mobile Popup Ad
Mobile Popup Ad

హాస్టల్‌ వాష్‌రూమ్‌లో ప్రసవం.. నవజాత శిశువు మృతి

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హాస్టల్‌లో నివసిస్తున్న యువతి వాష్‌రూమ్‌లో (Hostel Washroom Delivery) ప్రసవించింది.అనంతరం నవజాత శిశువును వెంటిలేటర్‌ ద్వారా బయటకు విసిరేయడంతో శిశువు మృతి చెందింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రసవానంతరం సదరు యువతి అస్వస్థతకు గురికావడంతో ఆమెను నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు..

అయితే హాస్టల్ సిబ్బందికి యువతి గర్భం దాల్చిన విషయం తెలియకవపోవడం చర్చనీయాంశం గామారింది. సదరు యువతి తన బావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. యువతి గర్భం దాల్చడంపై ఇంకా అధికారులు స్పష్టతనివ్వలేదు. చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత పూర్తి వివరాలు సేకరించి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. యువతి గర్భధారణ పరిస్థితులు, శిశువు మరణానికి దారితీసిన కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వైద్య పరీక్షల నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, హాస్టల్‌ సిబ్బంది వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>