కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి లో రోడ్డెక్కిన రైతులు

కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డి పేట్ మండలం ధర్మారెడ్డి గ్రామ రైతులు (Kamareddy Farmers) యూరియా కోసం రోడ్డెక్కారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా, నిరసన రాస్తారోకో చేపట్టారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. చిన్న ఫోన్‌లు ఉన్న తాము యూరియా ఎలా బుక్ చెయ్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యూరియా యాప్ తీసేసి రైతులకు పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>